russia: అమెరికా రక్షణ వ్యవస్థను నాశనం చేయగల భారీ అణు క్షిపణి ప్రయోగానికి సిద్ధమైన రష్యా

  • శాటన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం
  • హిరోషిమా, నాగసాకిలపై వేసిన బాంబుల కంటే 2 వేల రెట్లు శక్తిమంతమైనది
  • ప్రపంచంలోని ఏ రక్షణ వ్యవస్థనైనా ఛేదించగలదు

ఇప్పటికే అత్యంత శక్తిమంతమైన ఆయుధ శక్తిని కలిగి ఉన్న రష్యా... తన చరిత్రలోనే అతి పెద్ద ఖండాంతర అణు క్షిపణి ప్రయోగానికి సిద్ధమైంది. శాటన్-2 క్షిపణిని పరీక్షించడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ ఏడాది చివర్లో ఈ ప్రయోగం చేయనుంది. 40 మెగాటన్నుల బరువున్న డజను న్యూక్లియర్ వార్ హెడ్ లను ఈ క్షిపణి మోసుకెళ్లగలదు. హిరోషిమా, నాగసాకిలపై వేసిన బాంబుల కంటే శాటన్-2 దాదాపు 2వేల రెట్లు శక్తిమంతమైనది. ఇప్పటికే దీని పరీక్ష రెండుసార్లు వాయిదా పడింది. మిస్సైల్ లో సాంకేతిక లోపం తలెత్తడమే దీనికి కారణం. 2019 కల్లా ఈ ప్రయోగాలను పూర్తి చేసి, సైన్యానికి అందిస్తామని అధికారులు తెలిపారు. ప్రపంచంలో ఉన్న ఏ రక్షణ వ్యవస్తనైనా ఛేదించగల సత్తా దీని సొంతమని చెప్పారు.

  • Loading...

More Telugu News