telangana: ఇన్స్యూరెన్స్ కంపెనీ ఏర్పాటును కేసీఆర్ అధ్యయనం చేస్తున్నారు: గుత్తా

  • రైతులకు మేలు చేసేందుకే
  • ఇప్పటికే గుజరాత్, పంజాబ్ లలో ఈ తరహా కంపెనీలు
  • కేసీఆర్ అధ్యయనం చేస్తున్నారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇన్స్యూరెన్స్ కంపెనీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకుందని చెప్పారు. పత్తి రైతుల కోసం ఇప్పటికే గుజరాత్, పంజాబ్ ప్రభుత్వాలు ఈ తరహా కంపెనీలను ఏర్పాటు చేసి, మంచి ఫలితాలను సాధించాయని తెలిపారు.

ఆ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ సమాచారం తెప్పించుకున్నారని, లోటుపాట్లపై అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. గత ఏడాదిలో పలు బ్యాంకుల ఇన్య్యూరెన్స్ విభాగాల లాభం రూ. 16 వేల కోట్ల వరకు ఉందని... రైతులకు రావాల్సినదాన్ని వారు లాభాల్లో చూపించుకుంటున్నారని తెలిపారు.

telangana
insurance company
gutha sukhender reddy
  • Loading...

More Telugu News