kishor thirumala: ఫస్ట్ మూవీ ఛాన్స్ అలా వచ్చింది: దర్శకుడు కిషోర్ తిరుమల
- అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాను
- సీన్ పేపర్లు ఫెయిర్ చేసేవాడిని
- బీవీఎస్ రవి గుర్తించారు
- ఫస్టు మూవీకి సపోర్ట్ గా నిలిచారు
'నేను శైలజ' సినిమా హిట్ తో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న కిషోర్ తిరుమల, 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాతో ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా ఐ డ్రీమ్స్ కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫస్టు మూవీ ఛాన్స్ ఎలా వచ్చింది? అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.
"అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను పనిచేస్తున్నప్పుడు .. నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది గనుక, సీన్ పేపర్లు ఫెయిర్ చేయించేవారు. ఒకసారి బీవీఎస్ రవిగారు ఒక థాట్ చెప్పి డెవలప్ చేయమని అన్నారు. నేను మూడు .. నాలుగు రోజుల్లో ఆ థాట్ ను స్క్రిప్ట్ గా రెడీ చేసి తీసుకెళ్లి చూపించాను. ఆయన చాలా బాగుంది అన్నారు .. అప్పటి నుంచి అయన ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇద్దరం కలిసి చాలా సినిమాలకి పనిచేస్తూ ఉండేవాళ్లం. నా ఫస్టు సినిమా 'సెకండ్ హ్యాండ్' ఐడియా కూడా బీవీఎస్ రవికి బాగా నచ్చింది. ఆయన సపోర్ట్ తో పాటు .. నా ఫ్యామిలీ ఫ్రెండ్ పూర్ణ సపోర్ట్ తో ఆ సినిమా చేశాను" అని చెప్పారు.