jio: జియో వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరగనున్న టారిఫ్ లు!

  • జనవరిలో మళ్లీ టారిఫ్ ల పెంపు
  • రూ. 309 ప్యాకేజీ కాలపరిమితి తగ్గింపు
  • అంచనా వేసిన గోల్డ్ మన్ శాచ్

టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో రంగప్రవేశం చేసిన తర్వాత కస్టమర్లను పెంచుకోవడానికి అతి తక్కువ టారిఫ్ లను, ఫ్రీ వాయిస్ కాల్స్ వంటి ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సంస్థ లాభాలపై దృష్టి సారించింది. గత వారం 15 నుంచి 20 శాతం వరకు టారిఫ్ లను పెంచేసిన జియో... ఇప్పుడు మరోసారి టారిఫ్ ల పెంపు దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే జనవరిలో జియో మరోసారి టారిఫ్ లను పెంచనుందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్ మన్ శాచ్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న రూ. 309 ప్యాకేజీ గడువును 49 రోజుల నుంచి 28 రోజులకు కుదించే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో, జియో టారిఫ్ ల పెంపుతో ఎయిర్ టెల్ ఎక్కువగా లాభపడుతుందని అంచనా వేసింది.

jio
reliance jio
jio tariff
  • Loading...

More Telugu News