rtc bus accident: వాగులోకి దూసుకెళ్లిన బస్సు.. మధిర మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు!

  • డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న ప్రయాణికులు
  • మాజీ ఎమ్మెల్యే వెంకటనర్సయ్యకు తీవ్ర గాయాలు
  • హైదరాబాదు నుంచి ఖమ్మం వస్తుండగా ప్రమాదం

మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి, వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న వెంకటనర్సయ్య సహా 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

మాజీ ఎమ్మెల్యేకు పెదవులు పగిలిపోయాయని, పళ్లు కూడా రాలి ఉండవచ్చని చెబుతున్నారు. చాలా రక్తం పోయిందని తోటి ప్రయాణికులు తెలిపారు. గాయపడ్డవారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేశారు. హైదరాబాదు నుంచి ఖమ్మం వస్తుండగా ఈ బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదానికి గురైందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

rtc bus accident
ex mla venkatanarsaiah
  • Loading...

More Telugu News