pavan kalyan: పవన్ తో 'మెర్సెల్' రీమేక్ .. అదేం లేదంటున్న నిర్మాత!

  • తమిళంలో 'మెర్సెల్' భారీ వసూళ్లు 
  • విజయ్ ఖాతాలోకి మరో బ్లాక్ బస్టర్ 
  • కథలో భాగంగా రాజకీయ పరమైన అంశాలు 
  • ఈ మూవీ తెలుగు రీమేక్ పవన్ చేయనున్నాడంటూ ప్రచారం

రీమేక్ ల పై పవన్ దృష్టి పెడుతూనే ఉంటాడు .. తన మనసుకు నచ్చిన సినిమాల రీమేక్స్ లో ఆయన చేస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలో ఆయన 'మెర్సెల్' రీమేక్ లో చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. విజయ్ హీరోగా తమిళంలో విడుదలైన 'మెర్సెల్' భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ సినిమాలో రాజకీయ పరమైన అంశాల ప్రస్తావన ఉండటంతో, ఈ సినిమా రీమేక్ లో పవన్ చేయనున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.

 ఈ సినిమా తెలుగు వెర్షన్ 'అదిరింది'ని ఇక్కడ శరత్ మరార్ రిలీజ్ చేయనున్నారు. శరత్ మరార్ తో పవన్ కి మంచి సాన్నిహిత్యం వుంది. ఈ రీమేక్ లో చేయాలనే ఉద్దేశంతో వున్న పవన్, ఆయనకి ఫోన్ చేసి తెలుగు వెర్షన్ ను హోల్డ్ లో పెట్టమన్నాడని చెప్పుకుంటున్నారు. అయితే, ఈ విషయం గురించి తనతో పవన్ మాట్లాడలేదని శరత్ మరార్ సన్నిహితులతో చెప్పడం .. తమని రీమేక్ రైట్స్ గురించి ఎవరూ సంప్రదించలేదని 'మెర్సెల్' నిర్మాతలు స్పష్టం చేయడంతో, ఇదంతా పుకారేనని తేలిపోయింది.       

  • Loading...

More Telugu News