srkmeetsaruna: షారుక్‌ని క‌ల‌వ‌డ‌మే త‌న చివ‌రి కోరిక‌న్న కేన్స‌ర్ పేషెంట్ అరుణ మృతి!

  • అరుణ మ‌ర‌ణ‌వార్త‌ను ట్విట్ట‌ర్‌లో పెట్టిన కుమారుడు అక్ష‌త్‌
  • సంతాపం తెలిపిన బాలీవుడ్ బాద్‌షా
  • ఆరేళ్లుగా కేన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న అరుణ‌

ఇటీవ‌ల #SRKMeetsAruna అనే ట్యాగ్‌తో కేన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న అరుణ‌ను షారుక్ క‌ల‌వాల‌ని నెటిజ‌న్లు చేసిన ప్ర‌య‌త్నం పాక్షికంగా ఫ‌లించిన సంగ‌తి తెలిసిందే. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కి చెందిన అరుణ ఇవాళ ఉద‌యం మ‌ర‌ణించారు. త‌న తల్లి చివ‌రి కోరిక తీర్చ‌డానికి నెటిజ‌న్లు చేసిన ప్ర‌య‌త్నానికి మ‌రొక్క‌సారి కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ఆమె చ‌నిపోయిన విష‌యాన్ని అరుణ కుమారుడు అక్ష‌త్ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించాడు. #SRKMeetsAruna ట్యాగ్‌కి స‌మాధానంగా వీడియో ద్వారా అరుణ కుటుంబానికి ధైర్యం చెప్పిన షారుక్ ఆమె మ‌ర‌ణానికి సంతాపం వ్య‌క్తం చేశాడు. ఆమెతో ఫోన్లో మాట్లాడ‌టానికి షారుక్ ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ డాక్ట‌ర్లు అనుమ‌తించ‌లేదు. ఆరేళ్లుగా కేన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న అరుణ ‌గుర్గావ్‌లోని అర్టెమిస్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించింది.

srkmeetsaruna
twitter
cancer survivor
shah rukh khan
gurgaon
madya pradesh
  • Loading...

More Telugu News