chandrababu: చంద్రబాబును కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయించలేదు?: వైసీపీ

  • ఓటుకు నోటు కేసులో ఎందుకు అరెస్ట్ చేయించలేదు?
  • జగన్ ను విమర్శించడమే టీడీపీ నేతల పని
  • అవాకులు, చెవాకులు పేలితే ఊరుకోం

తమ అధినేత జగన్ ను విమర్శించడమే టీడీపీ నేతల ఏకైక అజెండా అని వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులు మండిపడ్డారు. పాదయాత్ర ప్రకటనను జగన్ చేసినప్పటి నుంచి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. జగన్ పాదయాత్ర గురించి టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎన్నో కేసుల్లో స్టేలు తెచ్చుకున్న ఘనుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.

ఓ ఫోన్ కాల్ ఆధారంగా మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు పెట్టి, అతని అనుచరులను కేసీఆర్ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని... మరి, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన చంద్రబాబును కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయించలేదని వారు ప్రశ్నించారు. టీటీడీపీ నేత రేవంత్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు, యనమల రామకృష్ణుడు ఇంతవరకు ఎందుకు స్పందించలేదని అన్నారు. జగన్ గురించి అవాకులు, చవాకులు పేలితే ఊరుకోబోమని హెచ్చరించారు. సీబీఐ కోర్టులో జగన్ కు ఊరట లభించదనే విషయాన్ని హోంమంత్రి చినరాజప్ప ముందే ఎలా చెప్పారని... ఆయన వ్యాఖ్యలను సీబీఐ కోర్టు సుమోటోగా స్వీకరించాలని అన్నారు. 

chandrababu
Telugudesam
kcr
TRS
ys jagan
ysrcp
vellampally srinivas
malladi vishnu
  • Loading...

More Telugu News