pavan: త్రివిక్రమ్ పుట్టినరోజున 'అజ్ఞాతవాసి' టైటిల్ ప్రకటన

  • పవన్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అజ్ఞాతవాసి' 
  • అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ నిరీక్షణ 
  • కథానాయికలుగా కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ 
  • జనవరి 9వ తేదీన విడుదల          

త్రివిక్రమ్ .. పవన్ కాంబినేషన్లోని సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ ను యూరప్ లో ప్లాన్ చేశారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ కాన్సెప్ట్ పోస్టర్ ను మాత్రమే రిలీజ్ చేశారు. టైటిల్ తో కూడిన లుక్ ఇంతవరకూ రాలేదు. 'అజ్ఞాతవాసి' అనే టాక్ వినిపిస్తోంది గానీ, టైటిల్ ను అధికారికంగా ఎనౌన్స్ చేయలేదు.

ఫస్టులుక్ దసరాకు వస్తుందనీ .. దీపావళికి వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూశారుగానీ, అలాంటి ప్రయత్నాలేవీ జరగలేదు. ఇక వచ్చేనెల 7వ తేదీన త్రివిక్రమ్ పుట్టినరోజు కావడం వలన, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారనేది తాజా సమాచారం. పవన్ సరసన కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9వ తేదీ .. సెకండ్ షో నుంచి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు.           

pavan
keerthi suresh
  • Loading...

More Telugu News