south Africa: ఈ ఈతగాడికి భూమ్మీద నూకలున్నాయి... ప్రమాదం నుంచి సులువుగానే బయటపడ్డాడు.. వీడియో చూడండి!

  • బ్లూవేల్స్ దగ్గరకు ఈదుకుంటూ వెళ్లిన డైవర్
  • బూవేల్ మీదకి ఎక్కే ప్రయత్నం  
  • ఈతగాడి చుట్టూ రెండు రౌండ్లు కొట్టిన బ్లూవేల్

సాహసాలు చేయడం కొందరికి సరదాగా ఉంటుంది. అలాంటి సరదా కలిగిన వ్యక్తి సముద్రంలోంచి అత్యంత ప్రమాదకరమైన పని చేసి బతికి బట్టకట్టాడు. దాని వివరాల్లోకి వెళ్తే, సౌతాఫ్రికాలోని కేప్ టౌన్ సమీపంలోని సముద్ర తీరంలో టూరిస్టులను తీసుకెళ్తున్న గైడు టూరిస్టుల కేరింతలతో సముద్రంలోకి చూశాడు. రెండు బ్లూ వేల్స్ (పెద్ద తిమింగలాలు) ఒడ్డుకు దగ్గరగా రావడం గమనించాడు. దీంతో దానిని వీడియో తీసేందుకు తన కెమెరా అన్ చేశాడు. ఇంతలో రెండు వేల్స్ ప్రక్కన ఒక వ్యక్తి ఈదుకుంటూ వాటికి దగ్గరగా వెళ్లడం చూశాడు.

 దీంతో అత్యంత ప్రమాదకరమైన రీతిలో వెళ్తున్న ఆ ఈతగాడిని తన కెమెరాలో బంధించాడు. వేల్స్ అని తెలిసి కూడా ఆ ఈతగాడు దాని వీపుపైకి ఎక్కే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ రెండు వేల్స్ అతని చుట్టూ రెండు రౌండ్లు కొట్టాయి. అయినా ఆ వ్యక్తి మూర్ఖంగా వాటి చుట్టూ తిరగడం, వాటి దగ్గరకు వెళ్లడం చేశాడు. అయితే అవి అతనిని ఏమీ చేయకుండానే.. నెమ్మదిగా సముద్రంలోకి వెళ్లిపోయాయి. దీంతో అతను సముద్రం నుంచి బయటకు వచ్చాడు. దీనిని సోషల్ మీడియాలో పెట్టగా, అది వైరల్ అయింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి. 

south Africa
cape town
diver
blue whale
  • Error fetching data: Network response was not ok

More Telugu News