siddharth: హారర్ థ్రిల్లర్ పైనే సిద్ధార్థ్ ఆశలు .. ఒకే రోజున మూడు భాషల్లో రిలీజ్

  • సక్సెస్ కోసం సిద్ధార్థ్ ఎదురుచూపులు 
  • సొంత నిర్మాణంలో సినిమా 
  • దెయ్యం కాన్సెప్ట్ పైనే నమ్మకం 
  • కథానాయికగా ఆండ్రియా  

హీరో సిద్ధార్థ్ కి తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో మంచి గుర్తింపు వుంది. అందువలన ఆయన తన తాజా చిత్రాన్ని ఈ మూడు భాషల్లో విడుదల చేయనున్నాడు. తనే కథానాయకుడిగా .. తన సొంత బ్యానర్లో తమిళంలో 'అవళ్' అనే సినిమాను ఆయన నిర్మించాడు. మిళింద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆండ్రియా కథానాయికగా నటించింది.

తెలుగులో 'గృహం' .. హిందీలో 'ది హౌస్ నెక్స్ట్ డోర్' అనే పేర్లతో ఈ సినిమాను నవంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నారు. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో .. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందినట్టు చెబుతున్నారు. ఒక ఇంట్లో దెయ్యం సృష్టించే భయానక సన్నివేశాల సమాహారంగా ఈ కథ కొనసాగనుంది. ఈ సినిమా ఈ మూడు భాషల్లోను తనకి తప్పకుండా సక్సెస్ ను తెచ్చిపెడుతుందనే ఆశతో సిద్ధార్థ్ వున్నాడు. ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి మరి.      

  • Error fetching data: Network response was not ok

More Telugu News