actress rashmi: పిల్లలు పడుకుని నిద్రపోయే సమయంలోనే మా ప్రోగ్రాం వస్తుంది: నటి రష్మి

  • అందంగా కనిపించడంలో తప్పులేదు
  • వల్గర్ గా కనిపించకూడదు
  • జబర్దస్త్ వచ్చే సమయానికి పిల్లలు పడుకుని ఉంటారు

సినిమాలో కానీ, టీవీ షోలో కానీ గ్లామరస్ గా కనిపించడంలో తప్పు లేదని... అయితే, అది అసభ్యంగా మాత్రం ఉండకూడదని సినీ నటి, జబర్దస్త్ భామ రష్మి తెలిపింది. తాను వల్గర్ గా కనిపించానని ఇంతవరకు ఎవరూ చెప్పలేదని తెలిపింది. ఒక షో కోసం పని చేస్తున్నప్పుడు... టీమ్ సభ్యులంతా ఎంతో భాధ్యతతో వ్యవహరిస్తామని చెప్పింది.

ఒక సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చారంటే... ఆ సినిమా విషయంలో అందరికీ ఓ క్లారిటి వస్తుందని తెలిపింది. డబుల్ మీనింగ్ డైలాగ్ ను కూడా కామెడీ కోణంలోనే చూడాలని చెప్పింది. ఇలాంటి వాటిని పిల్లలు చూడ్డానికి తాము ఎంకరేజ్ చేయమని తెలిపింది. ఈటీవీలో ప్రసారం అవుతున్న 'జబర్దస్త్' ప్రోగ్రాం రాత్రి 9.30 గంటలకు వస్తుందని... అప్పటికే పిల్లలంతా పడుకుని, నిద్రపోతారని చెప్పింది.  


actress rashmi
jabardast rashmi
tollywood
jabardast
  • Loading...

More Telugu News