Reliance: పేలిన జియో 4జీ ఫీచర్ ఫోన్.. ఖండించిన రిలయన్స్

  • ఇటీవలే జనాల చేతుల్లోకి వచ్చిన 4జీ ఫీచర్ ఫోన్లు
  • అంతలోనే కలవరపెడుతున్న పేలుడు వార్త
  • దురుద్దేశపూరిత ప్రచారమన్న రిలయన్స్ 

రిలయన్స్ జియో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన జియో 4జీ ఫీచర్ ఫోన్ పేలడం కలకలం రేపుతోంది. ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వినియోగదారుల చేతుల్లోకి ఇటీవలే ఈ ఫోన్ రాగా రోజులైనా గడవకముందే ఫోన్ పేలడం వినియోగదారులను భయపెడుతోంది. ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఫోన్ ముందు భాగం బాగానే ఉండగా, బ్యాక్ కవర్, చార్జింగ్ పిన్ పూర్తిగా ముద్దలా మారాయి. కశ్మీర్‌లో ఈ ఘటన జరగ్గా ఇందుకు సంబంధించిన ఫొటోలను ‘ఫోన్ రాడార్’ అనే వెబ్‌సైట్ తన ట్విట్టర్‌లో ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

జియో ఫోన్ పేలిందన్న వార్తను రిలయన్స్ ఖండించింది. తమ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీసేందుకు ఎవరో కావాలనే ఇలా చేశారని పేర్కొంది. అంతర్జాతీయ ప్రమాణాలతో తయారుచేసిన ఈ ఫోన్ పేలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఫోన్‌ను పూర్తిగా పరీక్షించిన తర్వాత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్టు స్పష్టం చేసింది. ఈ ఘటనపై విచారణ చేపడతామని పేర్కొంది.

Reliance
Jio
feature phone
Exploded
  • Loading...

More Telugu News