fan: షారుక్ `ఫ్యాన్‌` సినిమాలో `జ‌బ్రా ఫ్యాన్‌` పాట పెట్ట‌లేద‌ని నిర్మాత‌ల‌పై కేసు... విజ‌యం సాధించిన అభిమాని!

  • నిడివి దృష్ట్యా పాట‌ను తొల‌గించిన నిర్మాత‌లు
  • కేసు వేసిన మ‌హిళా అభిమాని
  • రూ. 15,000 న‌ష్టప‌రిహారం చెల్లించిన య‌శ్‌రాజ్ ఫిలింస్‌

2016లో వ‌చ్చిన‌ షారుక్ ఖాన్ సినిమా `ఫ్యాన్‌` గుర్తుంది క‌దా!... ఆ చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా విడుద‌ల చేసిన `జ‌బ్రా ఫ్యాన్‌` పాట‌కు అంద‌రూ ఫిదా అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ పాట కోసమే థియేట‌ర్‌కి వెళ్లి సినిమా చూసిన వాళ్లకు చేదు అనుభ‌వం క‌లిగిన విష‌యంలో అప్ప‌ట్లో వైర‌ల్‌గా మారింది. సినిమాలో నిడివి త‌గ్గించ‌డానికి ఈ పాట‌ను థియేట‌ర్ వెర్ష‌న్ నుంచి తొల‌గించారు. అయితే దీనిపై ఔరంగాబాద్‌కి చెందిన అఫ్రీన్ జైదీ అనే యువ‌తి జిల్లా వినియోగ‌దారుల ఫోరంలో ఫిర్యాదు చేసింది.

ఈ విష‌యంపై విచార‌ణ చేప‌ట్టిన మ‌హారాష్ట్ర వినియోగ‌దారుల ఫోరానికి చెందిన ఔరంగాబాద్ బెంచ్ అఫ్రీన్‌కి రూ. 15,000 న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని సినిమా నిర్మాణ సంస్థ య‌శ్‌రాజ్ ఫిలింస్‌ను ఆదేశించింది. అభిమానిని మాన‌సికంగా వేధించినందుకు గాను రూ. 10,000, ఫిర్యాదు ఖ‌ర్చు రూ. 5000 చెల్లించాల‌ని పేర్కొంది.  

fan
shah rukh khan
jabra fan
case
consumer court
producers
compensatin
  • Error fetching data: Network response was not ok

More Telugu News