ys jagan: వారం వారం కోర్టుకు వెళతాడా? లేక పాదయాత్రకు వెళతాడా?: జగన్ పై చినరాజప్ప సెటైర్లు

  • కోర్టు మినహాయింపు ఇవ్వదని చెబుతూనే ఉన్నాం
  • వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు
  • నాయకులను కాపాడుకునేందుకే జగన్ పాదయాత్ర


విచారణకు హాజరుకాకుండా జగన్ కు కోర్టు మినహాయింపు ఇవ్వదనే విషయాన్ని తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నామని... ఇప్పుడదే జరిగిందని ఏపీ మంత్రి చినరాజప్ప అన్నారు. ఇక వారం వారం కోర్టుకు వెళతాడో లేక పాదయాత్రకు వెళతాడో జగనే నిర్ణయించుకోవాలని దెప్పిపొడిచారు. మొన్న జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత వైసీపీ నేతలంతా ఆ పార్టీ నుంచి జారిపోతున్నారని... అందుకే పాదయాత్ర చేస్తూ, నేతలను కాపాడుకోవాలని జగన్ భావించారని అన్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ వచ్చిన జగన్... ఇప్పటికైనా మారాలని, రాష్ట్ర ఉన్నతి కోసం సహకరించాలని సూచించారు.

ys jagan
jagan padyatra
jagan case
ap home minister
china rajappa
  • Loading...

More Telugu News