kl rahul: టీమ్ సెలెక్షన్ పై గంగూలీ అసంతృప్తి
- రాహుల్ ను పక్కన పెట్టడం దారుణం
- భారత క్రికెట్ కు రాహుల్ ఆశాకిరణం
- టాలెంట్ ను పక్కన పెట్టకండి
న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలు కావడం పలువురికి రుచించడం లేదు. జట్టు ఓటమి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. పూర్తి స్థాయి బ్యాటింగ్ లైనప్ లేకుండానే బరిలోకి దిగారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. కొన్ని మ్యాచ్ ల నుంచి కేఎల్ రాహుల్ ను పక్కనబెట్టడాన్ని గంగూలీ ప్రశ్నించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు రాహుల్ ను పక్కన పెట్టడంపై విస్మయం వ్యక్తం చేశాడు.
భారత క్రికెట్ కు రాహుల్ ఒక ఆశాకిరణమని... అలాంటి ఆటగాడు జట్టులో లేకపోవడం సరైనది కాదని దాదా అన్నాడు. రాహుల్ జట్టులో ఉండటం చాలా అవసరమని... వెంటనే అతన్ని ఆడించే ప్రయత్నం చేయాలని తెలిపాడు. విదేశీ పర్యటనల్లో కూడా రాహుల్ బాగా రాణించాడని... టాలెంట్ ను పక్కన పెట్టకుండా రాహుల్ ను ప్రోత్సహించాలని సూచించాడు.