revanth reddy: రేవంత్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధం?

  • రేవంత్ పై వేటు వేయాలంటూ పొలిట్ బ్యూరో తీర్మానం
  • అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరాదంటూ చంద్రబాబుకు లేఖ
  • కఠిన చర్యలు తీసుకోవాలంటూ విన్నపం

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. రేవంత్ ను పదవి నుంచి తొలగించాలని పొలిట్ బ్యూరో తీర్మానించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు పొలిట్ బ్యూరో లేఖ రాసింది. పార్టీ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించిన రేవంత్ రెడ్డికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరాదంటూ లేఖలో కోరింది.

కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలను కూడా రేవంత్ ఇంతవరకు ఖండించలేదని... అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో టీటీడీపీ పొలిట్ బ్యూరో ఈ మేరకు తీర్మానించింది. చంద్రబాబు విదేశీ పర్యటన ముగిసేలోగానే రేవంత్ పై వేటు పడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

revanth reddy
tTelugudesam
tTelugudesam politburo
chandrababu
  • Loading...

More Telugu News