mersel movie: మెర్సల్ కి రజనీకాంత్ మద్దతు... సమాజంలో ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారంటూ ప్రశంస!

  • ‘ఇళయ దళపతి’ విజయ్‌ ‘మెర్సల్‌’ సినిమాలో పేలిన జీఎస్టీ  డైలాగులు
  • ఆ డైలాగులు తొలగించాలంటూ బీజేపీ నేతల డిమాండ్ 
  • విజయ్ కు తలైవా రజనీకాంత్, విశ్వనాయకుడు కమల్ మద్దతు

తమిళ సూపర్‌ స్టార్‌ ‘ఇళయ దళపతి’ విజయ్‌ త్రిపాత్రాభినయం చేస్తూ నటించిన ‘మెర్సల్‌’ చిత్రంలోని జీఎస్టీ డైలాగులపై బీజేపీ నేతలంతా మూకుమ్మడిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి గతంలో విశ్వనాయకుడు కమలహాసన్ చిత్ర యూనిట్ కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ తలైవా రజనీకాంత్ కూడా ఈ సినిమాకు మద్దతు పలికారు.

ట్విట్టర్ ద్వారా స్పందించిన రజనీ... ప్రస్తుతం సమాజంలో ముఖ్యమైన అంశాన్నే సినిమాలో ప్రస్తావించారంటూ చిత్రబృందాన్ని అభినందించారు. మంచి సినిమా తీశారంటూ ప్రశంసించారు. కాగా, దీపావళికి విడుదలైన ఈ సినిమా వంద కోట్ల రూపాయల వసూళ్లు దాటి దూసుకుపోతోంది. ఈ సినిమాలో జీఎస్టీపై చేసిన డైలాగులు తొలగించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ సినిమా త్వరలో తెలుగులో 'అదిరింది' పేరిట విడుదల కానుంది. 

mersel movie
rajani kanth
bjp
comments
  • Loading...

More Telugu News