esha deol: హేమమాలినికి మనవరాలు పుట్టింది!

  • ఈ ఉదయం పాపకు జన్మనిచ్చిన ఈషా డియాల్
  • తల్లి, బిడ్డ క్షేమమేనన్న ఆసుపత్రి వర్గాలు
  • రెండోసారి గ్రాండ్ పేరెంట్స్ అయిన ధర్మేంద్ర, హేమమాలిని

వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర, డ్రీమ్ గర్ల్ హేమమాలిని దంపతుల కుమార్తె ఈషా డియాల్ ఈ ఉదయం ముంబైలోని హిందుజా ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చింది. 2012 జూన్ 29న భరత్ తఖ్తానీతో ఈషా డియాల్ వివాహం జరుగగా, ఈ సంవత్సరం ఏప్రిల్ లో తాను గర్భవతినని ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆపై తాను గర్భవతిగా ఉన్నప్పటి చిత్రాలతో ఆమె సోషల్ మీడియాలో ఎన్నో చిత్రాలను పోస్ట్ చేసింది. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, ధర్మేంద్ర, హేమమాలిని జంట గ్రాండ్ పేరెంట్స్ కావడం ఇది రెండో సారి. రెండేళ్ల క్రితం వీరి చిన్న కుమార్తె అహానా తొలి చిన్నారికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

esha deol
hemamalini
dharmendra
  • Loading...

More Telugu News