ys jagan: జడ్జి మనసులో ఏముంది? కాసేపట్లో జగన్ పై తీర్పు!

  • తీర్పు ఇవ్వడానికి చైర్ లో కూర్చున్న జడ్జి
  • తీర్పు ఎలా వచ్చినా పాదయాత్ర కొనసాగుతుందన్న వైసీపీ నేతలు
  • తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ

పాదయాత్ర సందర్భంగా సీబీఐ కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలంటూ వైసీపీ అధినేత జగన్ పెట్టుకున్న పిటిషన్ కు సంబంధించి కాసేపట్లో తీర్పు వెలువడనుంది. తీర్పును వెలువరించడానికి కాసేపటి క్రితం జడ్జి బెంచ్ ఎక్కారు. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీలోనే కాకుండా అటు టీడీపీలో కూడా ఉత్కంఠ నెలకొంది.

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇస్తారా? లేక ప్రతి శుక్రవారం యథావిధిగా కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తారా? అనే ఉత్కంఠ అందర్లో నెలకొంది. మరోవైపు, కోర్టు విచారణకు హాజరు కావాల్సిందేనంటూ జడ్జి ఆదేశించినా... జగన్ పాదయాత్ర మాత్రం షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు జగన్ హాజరవుతుంటే... పాదయాత్ర వల్ల వైసీపీకి వచ్చే లాభం ఏమీ ఉండబోదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News