s janaji: పాటకు గుడ్ బై చెబుతున్న జానకమ్మ... సంచలన నిర్ణయం తీసుకున్న గానకోకిల ఎస్.జానకి!

  • రిటైర్మెంట్ తీసుకుంటున్న జానకి
  • ఈనెల 28న చివరి కచేరి
  • కెరీర్ ప్రారంభించిన చోటే ముగింపు కూడా

దాదాపు 60 ఏళ్లుగా తన పాటలతో అలరించిన గానకోకిన ఎస్.జానకి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గాయకురాలిగా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 65 ఏళ్ల క్రితం మైసూరులో పాటలు పాడటం ప్రారంభించానని... తన చివరి కచేరిని కూడా అక్కడే ఇచ్చి, విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. ఈ నెల 28న మానసగంగోత్రి మైదానంలో తన చివరి కచేరి జరుగుతుందని ఆమె తెలిపారు. వయసు పైబడుతుండటంతో పాడటం కష్టంగా మారిందని... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మైసూరులో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విషయాలను వెల్లడించారు.

s janaji
singer s janaki
singer janaki retirement
  • Loading...

More Telugu News