lavanya tripathi: తమన్నా .. రకుల్ బాటలో లావణ్య త్రిపాఠి!

  • కెరియర్ పరంగా కథానాయికలు వెలుగొందే కాలం తక్కువ 
  • దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటోన్న కథానాయికలు 
  • ఒక వైపున సినిమాలు .. మరో వైపున వ్యాపార వ్యవహారాలు

కొంతమంది కథానాయికలు మినహా మిగతా కథానాయికల కెరియర్ తక్కువ కాలంలోనే ముగిసిపోతుంటుంది. అందువలన వాళ్లు ఆ సమయంలోనే వివిధ భాషల్లో అవకాశాలను చేజిక్కించుకుంటూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటూ వుంటారు. కెరియర్ మంచి జోరు మీద ఉండగానే తమకి తెలిసిన ఏదైనా బిజినెస్ ను స్టార్ట్ చేసేసి .. అవకాశాలు తగ్గిన తరువాత వ్యాపార వ్యవహారాల పైనే పూర్తి దృష్టి పెడుతుంటారు.

 అలా తమన్నా జ్యుయలరీ బిజినెస్ ను .. రకుల్ 'ఫిట్ నెస్' బిజినెస్ ను రన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా అదే బాటలో అడుగులు వేయడానికి తాను సిద్ధమవుతున్నట్టుగా లావణ్య త్రిపాఠి చెప్పింది. తనకి ఫుడ్ బిజినెస్ మీద .. ఫిట్ నెస్ బిజినెస్ మీద మంచి అవగాహన ఉందని అంది. అందువలన ఈ రెండు విభాగాలలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పింది. ఈ విషయంలో తనకి ఒక స్పష్టత వచ్చిన తరువాత, ఎప్పుడు .. ఎక్కడ అనేది చెబుతానని అంది. 

lavanya tripathi
  • Loading...

More Telugu News