vizag: విశాఖలో కలకలం... నడిరోడ్డుపై యాచకురాలిపై అత్యాచారం, వినోదం చూస్తూ వీడియో తీసుకున్న జనం!

  • తలదించుకున్న సభ్య సమాజం
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • కేసును విచారిస్తున్నామని వెల్లడి

సభ్య సమాజం మరోసారి తలదించుకుంది. మద్యం తాగిన మత్తులో ఓ యువకుడు, పట్టపగలు, నడిరోడ్డుపై ఉన్న యాచకురాలిపై అత్యాచారం చేస్తుంటే, అతన్ని నిలువరించాల్సిన ప్రజలు వినోదం చూస్తూ ఉండిపోయారు. కొందరు ఆనందంగా వీడియోలు తీసుకున్నారు. ఈ ఘటన విశాఖపట్నం, శ్రీనివాస కల్యాణమండపం రోడ్డులో జుగుప్స కలిగించింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, స్టేషన్ పరిసరాల్లో అడుక్కుంటూ జీవిస్తున్న ఓ మతిస్థిమితం లేని యువతిపై, రైల్వే న్యూ కాలనీకి చెందిన గంజి శివ (25) మద్యం తాగి వచ్చి అత్యాచారానికి దిగాడు. అటుగా వెళుతున్న వారు ఈ ఘటనను చూశారే తప్ప, ఎవరూ అడ్డుకోలేదు. ఆటో డ్రైవర్ అర్జి శ్రీను ఘటనను వీడియో తీస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆపై గంజి శివను అరెస్ట్ చేశామని, బాధితురాలిని ఆసుపత్రికి తరలించామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

vizag
begger
srinivasa kalyana mandapam
  • Loading...

More Telugu News