internet: సెకనుకు 10 వేల ఎంబీ వేగం... కలను నిజం చేసిన కేంబ్రిడ్జ్!
- ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లపైనే డేటా
- ఫ్రీక్వెన్సీ కోడ్ మార్చడం ద్వారా సాధ్యం
- రిసీవర్లను అభివృద్ధి చేసిన పరిశోధకులు
ఇంటర్నెట్ మాధ్యమంగా డేటా బట్వాడాను గణనీయంగా పెంచే అత్యాధునిక హార్డ్ వేర్ ను బ్రిటన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని సాయంతో సెకనుకు 10 వేల మెగాబైట్ల (10 గిగాబైట్లు) డేటా వేగాన్ని అందుకోవచ్చు. సర్వీస్ ప్రొవైడర్లను, ఇంటర్నెట్ కస్టమర్లను అనుసంధానించే ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లపై ఈ డేటా బట్వాడా అవుతుంది. డేటాను విభిన్న ఫ్రీక్వెన్సీల్లో లేదా లైట్, కలర్ కోడ్ మధ్య ఉండే వ్యత్యాసం సాయంతో వేగంగా పంపేందుకు వీలు కల్పించే రిసీవర్లను పరిశోధకులు అభివృద్ధి చేశారు.
కాగా, ప్రస్తుతం అత్యధిక డేటా బదిలీకి వాడే కొహెరెంట్ రిసీవర్లతో పోలిస్తే వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. పైగా ఇవి పరిణామంలో చిన్నగా ఉంటాయి. నిపుణుల అంచనాల మేరకు 2025 నాటికి ప్రస్తుతమున్న ఇంటర్నెట్ వేగంతో పోలిస్తే 100 రెట్లు అధిక వేగాన్ని డేటా బట్వాడా అందుకుంటేనే ప్రజల అవసరాలు తీరుతాయి. 5జీ వంటి స్మార్ట్ గాడ్జెట్స్ కు కూడా ఈ వేగం అవసరమవుతుందని హార్డ్ వేర్ ను తయారు చేసిన టీమ్ లోని సెజెర్ ఎర్కిలింక్ వెల్లడించారు.