Asia cup hockey: ఆసియాకప్‌ ఫైనల్‌లో దుమ్మురేపిన టీమిండియా.. మూడోసారి కప్ కైవసం

  • మలేసియాపై 2-1తో విజయం
  • కీలక గోల్స్ చేసిన రమణ్‌దీప్, లలిత్ 
  • కాంస్యంతో సరిపెట్టుకున్న పాక్

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఆసియా  కప్‌ హాకీలో భారత జట్టు దుమ్మురేపింది. అద్భుత ప్రదర్శనతో చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో మలేసియాను 2-1తో ఓడించి ముచ్చటగా మూడోసారి ఆసియా కప్‌ను ముద్దాడింది. ఆదివారం మలేసియాతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో భారత్‌నే విజయం వరించింది. మూడో నిమిషంలో రమణ్‌దీప్ సింగ్, 29వ నిమిషంలో లలిత్ ఉపాధ్యాయ్‌లు గోల్స్ అందించి భారత విజయంలో కీలకపాత్ర పోషించారు.

శనివారం జరిగిన సూపర్-4 పోరులో పాక్‌ను 4-0 గోల్స్‌తో చిత్తు చేసిన భారత్ ఫైనల్లో ప్రవేశించింది. ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ భారత్ విజయం సాధించింది. ఒక్క కొరియాతో మ్యాచ్ మాత్రం 1-1తో డ్రా అయింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో కొరియాపై పాకిస్థాన్ 6-3 గోల్స్‌ తేడాతో విజయం సాధించి కాంస్యం గెలుచుకుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News