srisdhar babu: టీఆర్ఎస్ నేత ఇంట్లో గంజాయి పెట్టిరమ్మని సర్పంచ్ పై కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు ఒత్తిడి... సంచలనం కలిగిస్తున్న ఆడియో!

  • కొత్త చిక్కుల్లో పడ్డ శ్రీధర్ బాబు
  • గంజాయి అమ్మకం కేసులో ఇరికించాలని చూసిన శ్రీధర్ బాబు
  • సుదర్శన్ ఇంటికెళ్లి గంజాయి పెట్టి రావాలని ఓ సర్పంచ్ పై ఒత్తిడి
  • వెలుగులోకి వచ్చిన ఆడియో - కేసు నమోదు

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శ్రీధర్ బాబు కొత్త చిక్కుల్లో పడ్డారు. టీఆర్ఎస్ నేతను ఫోన్ లో బెదిరిస్తున్న ఆయన సంభాషణలు మీడియాకు ఎక్కాయి. తనను గంజాయి కేసులో ఇరికించేందుకు శ్రీధర్ ప్రయత్నిస్తున్నాడని కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫిర్యాదు చేస్తూ, తనను ఆయన బెదిరిస్తున్న ఆడియోలను సాక్ష్యాలుగా సమర్పించడంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఈ కేసుతో సంబంధమున్న ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేశామని, శ్రీధర్ బాబు ప్రమేయంపై విచారణ జరుగుతోందని అన్నారు. మీడియాలో వస్తున్న ఆడియోలో సుదర్శన్ అనే సర్పంచ్ ని శ్రీధర్ బాబు ఒత్తిడి చేస్తున్న సంభాషణలు వినిపిస్తున్నాయి. చిక్కడపల్లిలోని కిషన్ రెడ్డి ఇంటిలో గంజాయిని పెట్టించాలని ఆయన అడుగుతున్నట్టు ఉంది. నేడు వినాయకచవితని గుర్తు చేసిన సుదర్శన్, తరువాత ఆ పని చేస్తానని చెబుతున్నట్టు వినిపిస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలపై శ్రీధర్ బాబు ఇంకా స్పందించలేదు.

srisdhar babu
TRS leader sudarshan
kishan reddy
ganja
  • Loading...

More Telugu News