tirumala: తిరుమలలో కలకలం... తల్లీ కొడుకుల ఆత్మహత్య!

  • రాతిమండపం వద్ద ఘటన
  • అచేతనంగా పడివున్న తల్లీకొడుకులు
  • పోలీసులు వచ్చే సరికే పోయిన ప్రాణాలు
  • ఎవరో గుర్తించే పనిలో పోలీసులు

తిరుమలలోని రాతిమండపం వద్ద తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఉదయం ఓ మహిళ, మరో యువకుడు రాతిమండపం వద్ద అచేతనంగా పడివున్నారని, భక్తుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు, అక్కడికి వెళ్లి పరిశీలించి, అప్పటికే వారు మరణించారని గుర్తించారు. వీరు ఎవరన్న విషయం ఇంకా తెలియరాలేదు. రెండు మృతదేహాలనూ అశ్వని ఆసుపత్రికి తరలించారు. తమ వెంట తెచ్చుకున్న విషం తాగి వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని, వీరు ఎక్కడి నుంచి వచ్చారన్న విషయాన్ని విచారిస్తున్నామని అన్నారు.

tirumala
sucide
rati mandapam
  • Loading...

More Telugu News