darul uloom: మరో దేవుడిని పూజిస్తే.. ముస్లింలుగా గుర్తించం: ముస్లిం సంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్
- అల్లాను మాత్రమే పూజించాలి
- వేరే దేవుడిని పూజించేవారు ముస్లింలు కారు
- ఫత్వా జారీ చేసిన దారుల్ ఉలూమ్ దియోబంద్
ఉత్తరప్రదేశ్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ముస్లిం సంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్ తాజాగా కొత్త ఫత్వాను జారీ చేసింది. ముస్లింలు ఎవరూ అల్లాను కాకుండా మరే దేవుడిని పూజించరాదని ఫత్వాను విడుదల చేసింది. ఇతర దేవుళ్లను పూజించేవారిని భవిష్యత్తులో ముస్లింలుగా గుర్తించలేమని హెచ్చరించింది.
దీపావళి సందర్భంగా పలువురు ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున కాశీలో దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంపై దారుల్ ఉలూమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు మతాల మధ్య సామరస్యాన్ని సాధించేందుకు రాముడిని పూజించడం ఒక్కటే మార్గం కాదని... మనుషుల మధ్య ప్రేమ, ఔదార్యం వుండాలని దారుల్ ఉలూమ్ సభ్యుడు నజీమ్ అన్సారీ చెప్పారు.