lakshmis ntr: ఇంటర్వ్యూలో సహనాన్ని కోల్పోయిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నిర్మాత!

  • వెన్నుపోటు పొడవటం మీరు చూశారా? 
  • ఈ సినిమాకు, రాజకీయాలకు సంబంధం లేదు
  • నా దగ్గర డబ్బు లేదని ఎవరు చెప్పారు?

ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా నిర్మాత, వైసీపీ నేత రాకేష్ రెడ్డి సహనాన్ని కోల్పోయారు. ఇంటర్వ్యూ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎన్టీఆర్ కు పెద్ద అభిమానినని... అందుకే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. దర్శకుడు వర్మలో ఉండే క్రియేటివిటీ చాలా గొప్పదని... అందుకే ఆయనతో సినిమాను తీస్తున్నానని తెలిపారు. ఈ చిత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర కూడా ఉంటుందా? అనే ప్రశ్నకు బదులుగా... అన్ని విషయాలు ఉంటాయని చెప్పారు. ఈ సినిమా వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎదుర్కోగలనని... తాను కూడా రాయలసీమలోనే పుట్టానని తెలిపారు. లక్ష్మీపార్వతి పాత్రలో ఎమ్మెల్యే రోజా నటిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.

ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారని... ఆ సన్నివేశం ఈ సినిమాలో ఉంటుందా? అని రాకేష్ రెడ్డిని యాంకర్ అడిగారు. దీనికి సమాధానంగా వెన్నుపోటు పొడిచింది మీరు చూశారా? అంటూ ఎదురు ప్రశ్నించారు రాకేష్. అయితే వెన్నుపోటు పొడవలేదని మీరు అంటారా? అని యాంకర్ ప్రశ్నించగా... సహనాన్ని కోల్పోయిన రాకేష్ రెడ్డి ఆ విషయాన్ని సినిమాలోనే చూడాలని ఒకింత ఆగ్రహంగా చెప్పారు.

తాను సినిమా గురించి మాట్లాడటానికే ఇక్కడకు వచ్చానని... రాజకీయాల గురించి మాట్లాడటానికి రాలేదని స్పష్టం చేశారు. వైసీపీకి, ఈ సినిమా నిర్మాణానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాకేష్ రెడ్డి వద్ద సినిమా తీసేంత డబ్బు లేదని... ఈ సినిమాకు ఫైనాన్స్ చేస్తున్నది జగన్ అనే ఆరోపణలు ఉన్నాయన్న ప్రశ్నకు బదులుగా... తన వద్ద డబ్బు లేదని నిరూపిస్తే మీరు ఏం చెప్పినా చేస్తానని... నిరూపించలేకపోతే చానల్ ను క్లోజ్ చేసుకోవాలని అన్నారు.

lakshmis ntr
lakshmis ntr producer
ram gopal varma
chandrababu
  • Error fetching data: Network response was not ok

More Telugu News