revanth reddy: రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్!

  • రేవంత్ ను ఆహ్వానించింది నేనే
  • ఆయన రాకను ఎవరూ అడ్డగించవద్దు
  • హైకమాండ్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారనే వార్త ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ను పార్టీలోకి ఆహ్వానించింది తానేనని ఆయన తెలిపారు. తెలంగాణలో టీడీపీ లేదని... అందుకే కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ ను తానే కోరానని వీహెచ్ అన్నారు. చేరికలపై హైకమాండ్ నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ సర్దుకుపోవాలని చెప్పారు. రేవంత్ రాకను కాంగ్రెస్ నేతలు ఎవరూ వ్యతిరేకించవద్దని కోరారు. మోదీ ప్రభుత్వం ఇంతవరకు ఎన్నికల హామీలను కూడా నెరవేర్చలేదని చెప్పారు. ప్రతిపక్షాలను కేసుల పేరుతో భయపెట్టాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. 

revanth reddy
tTelugudesam
telangana congress
v hanumantha rao
  • Loading...

More Telugu News