potus: వేలంలో 16 వేల డాలర్లు పలికిన ట్రంప్ వేసిన డ్రాయింగ్
- ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ బొమ్మను వేసిన ట్రంప్
- లాస్ ఏంజెలెస్‌లో జరిగిన వేలం
- 1995లో ఛారిటీ కోసం డ్రాయింగ్ వేసిన అధ్యక్షుడు
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో నిర్వహించిన ఓ వేలంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన నల్ల స్కెచ్ డ్రాయింగ్ ఒకటి 16వేల డాలర్లు పలికింది. ఈ విషయాన్ని వేలం నిర్వహించిన సంస్థ జూలియన్స్ ఆక్షన్స్ మీడియాకు వెల్లడించింది. 1995లో ఛారిటీ కోసం ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో ఎస్టేట్‌లో ఉండి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ బొమ్మను ట్రంప్ గీశాడు. అప్పట్లో ఈ డ్రాయింగ్ 100 డాలర్ల కంటే తక్కువకే అమ్ముడు పోయినట్లు సమాచారం. గతంలో కూడా ట్రంప్ గీసిన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మరో డ్రాయింగ్ 29 వేల డాలర్లకు వేలంలో అమ్ముడుపోయింది.