team india: కోహ్లీకి ధోనీ అవసరం చాలా ఉంది...వరల్డ్ కప్ వరకు ధోనీ జట్టులో ఉంటాడు: గంగూలీ
- కీపర్ గానే కాకుండా, వ్యూహరచయితగా రాణిస్తున్న ధోనీ
- ధోనీ విలువ ఏంటో కోహ్లీకి బాగా తెలుసు
- ఫిట్ గా ఉంటే 2019 వరల్డ్ కప్ లో ధోనీ ఆడుతాడు
టీమిండియా కెప్టెన్ కోహ్లీకి మాజీ కెప్టెన్ ధోనీ అవసరం చాలా ఉందని దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ధోనీ కెరీర్, కోహ్లీ కెప్టెన్సీపై దాదా తన అభిప్రాయం వెల్లడిస్తూ, ఒక కీపర్ గానే కాకుండా, సారథిగా పని చేసిన అనుభవం ధోనీ ఇంకా జట్టుతో కొనసాగేందుకు ఉపయోగపడుతోందని అన్నాడు. కోహ్లీ వ్యూహరచనలో ధోనీ భాగమవుతున్నాడని, జట్టు విజయాల్లో ధోనీ వ్యూహాలు ఎంతో సాయపడుతున్నాయని చెప్పాడు. అందువల్లే ధోనీ ఇంకా జట్టులో కొనసాగుతున్నాడని, 2019 వన్డే వరల్డ్ కప్ వరకూ ధోనీ టీమిండియాలో కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు.
ధోనీ కేవలం కీపర్ గా మాత్రమే ఉండడం లేదని, వికెట్ల వెనుక నుంచి అద్భుతమైన వ్యూహాలు రచిస్తున్నాడని చెప్పాడు. ధోనీ 36 ఏళ్ల వయసులో కూడా జట్టులో ఉన్నాడంటే దానికి కారణం అదేనని చెప్పాడు. కెరీర్ ఆరంభంలో అంటే 2004లో చూసిన ధోనీకి, ఇప్పటి ధోనీకి ఆటలో పోలికలు చూడవద్దని అన్నాడు. వయసు పెరిగే కొద్ది ఎవరి ఆటైనా మారుతుందని, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఆట కూడా వయసుతో పాటూ మారిందని అన్నాడు. ఫిట్ గా ఉంటే ధోనీ ఆటను వచ్చే వరల్డ్ కప్ లో కూడా చూడవచ్చని గుంగూలీ తెలిపాడు.