ysrcp: బొత్స వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా

  • పెట్టుబడుల కోసమే సీఎం విదేశీ యాత్రలు
  • ప్రైవేట్ విమానాల్లో వెళ్లిన ఘనత వైయస్ దే
  • ఎన్నికల్లోపు వైసీపీ ఖాళీ అవుతుంది

ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనల గురించి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఏపీకి పెట్టుబడులను తీసుకొచ్చేందుకే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు వెళ్లారని తెలిపారు.

 వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు విమానాల్లో వెళ్లిన చరిత్ర మీదేనని... వైయస్, చంద్రబాబుల విదేశీ పర్యటనలపై చర్చకు సిద్దమా? అంటూ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లోపు వైసీపీ ఖాళీ అవుతుందని అన్నారు. జగన్ తీరు నచ్చకే వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసిన డబ్బును ప్రజలకు పంచిన తర్వాత... జగన్ పాదయాత్ర చేయాలని అన్నారు.

ysrcp
budda venkanna
Telugudesam mlc
botsa satyanarayana
ys jagan
Telugudesam
chandrababu
  • Loading...

More Telugu News