usain bolt: 2018లోగా ఫుట్‌బాల్ ఆట‌గాడిగా మార‌నున్న ఉసెన్ బోల్ట్‌

  • గాయాల కార‌ణంగా ఫిట్‌నెస్ కోల్పోయిన మాజీ స్ప్రింట‌ర్‌
  • ఉత్త‌మ ఆట‌గాడు రొనాల్డో అంటున్న‌ ఉసెస్ బోల్ట్‌
  • మెస్సీ, నేమార్‌లు కూడా ఇష్ట‌మే!

2018లోగా ఫుట్‌బాల్ ఆట‌గాడిగా కెరీర్ ప్రారంభించ‌నున్న‌ట్లు వ‌ర‌ల్డ్ ఫాస్టెస్ట్ మ్యాన్‌, మాజీ స్ప్రింట‌ర్ ఉసెన్ బోల్డ్ తెలిపాడు. `అవును.. నాకు ఫుట్‌బాల్ ఆడ‌టం చాలా ఇష్టం. దీని గురించి చాలా ఇంట‌ర్వ్యూల్లో చెప్పాను. కొన్ని ఫ్రాంచైజీ క్ల‌బ్స్ కూడా న‌న్ను సంప్ర‌దించాయి. కానీ గాయాల కార‌ణంగా ఫిట్‌నెస్ లేదు. శిక్ష‌ణ కూడా స‌రిగా చేయ‌లేక‌పోతున్నా. కానీ 2018లోగా కొన్ని ఆట‌లు ఆడే అవ‌కాశం క‌లుగుతుంద‌ని ఆశిస్తున్నా` అన్నాడు.

 ఫుట్‌బాల్‌లో ఉత్త‌మ ఆట‌గాడిగా క్రిస్టియానో రొనాల్డోను ఉసెన్ బోల్ట్ ఎంచుకున్నాడు. లియోన‌ల్ మెస్సీ, నేమార్‌లు కూడా త‌న‌కు ఇష్ట‌మ‌ని, వాళ్లు బాగా ఆడ‌తార‌ని ఆయ‌న పేర్కొన్నాడు. అలాగే ఏ ఆట‌లోనైనా అత్యున్న‌త స్థాయికి చేరాలంటే మంచి క్ర‌మ‌శిక్ష‌ణ‌, ఆశ‌యం, ప‌ట్టుద‌ల‌, క‌ష్ట‌ప‌డే త‌త్వం కావాల‌ని బోల్ట్ చెప్పాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News