guinness: ప్రమిదలలో మిగిలిన నూనె కోసం పరుగులు!
- ప్రమిదల్లో మిగిలిన నూనె కోసం స్థానికుల పరుగులు
- పోటీ పడిన పిల్లలు, మహిళలు
- వైరల్‌గా మారిన ఫొటోలు
దీపావళి పండగ సందర్భంగా అయోధ్యలోని సరయు ఘాట్ వద్ద 14వేల లీటర్ల నూనెతో 1.87 లక్షల దీపాలను వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రికార్డు వల్ల అయోధ్యకు పూర్వ వైభవం తిరిగి వచ్చిందని అందరూ అభిప్రాయపడ్డారు. దీపాల ఫొటోలను షేర్ చేసి గర్వపడ్డారు. కానీ ఆ మర్నాడు ఆ ప్రాంత పరిస్థితి గురించి ఎవరూ పట్టించుకోలేదు. అయితే గిన్నిస్ రికార్డుకు, మర్నాటి పరిస్థితులకు సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దీపాలు ఆరిపోయాక ఆ ప్రమిదల్లో మిగిలిపోయిన నూనెను తెచ్చుకోవడానికి స్థానికులు ఆరాటపడుతూ పరుగులు పెట్టారు. డబ్బాలు పట్టుకుని పిల్లలు, మహిళలు మిగిలిన నూనెను సేకరిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.