ys jagan: జగన్ సీఎం కావాలంటూ తిరుమలకు పాదయాత్ర చేపట్టిన నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే

  • పాదయాత్ర చేపట్టిన నరసరావుపేట ఎమ్మెల్యే
  • పాదయాత్రను ప్రారంభించిన ఉమ్మారెడ్డి
  • 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందన్న ఎమ్మెల్యే

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతోంది. ఎవరికి తోచిన కార్యక్రమాలను వారు చేపడుతూ, నూతనోత్సాహంతో ముందడుగు వేస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరో కార్యక్రమానికి తెర తీశారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ తిరుమలకు పాదయాత్రను చేపట్టారు. ఈ పాదయాత్రను వైసీపీ అధికార ప్రతినిధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, 2019లో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం, జగన్ సీఎం కావడం ఖాయమని చెప్పారు.

ys jagan
ysrcp
jagan padayarta
narasaraopet mla
gopireddy srinivasa reddy
gopireddy padayatra
tirumal padayatra
  • Loading...

More Telugu News