kidambi srikanth: వరల్డ్ నెంబర్ వన్ ను మట్టికరిపించిన కిడాంబి శ్రీకాంత్.. సైనా ఔట్

  • డెన్మార్క్ ఓపెన్ లో సంచలనం
  • సెమీస్ కు చేరిన శ్రీకాంత్
  • టోర్నీ నుంచి సైనా, ప్రణయ్ లు ఔట్

డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ లో సంచలనం నమోదైంది. ప్రపంచ 8వ ర్యాంకర్ తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్ సత్తా చాటాడు. వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడు, డెన్మార్క్ కు చెందిన విక్టర్ ఏక్సెల్సన్ ను చిత్తు చేసి, సెమీస్ లో అడుగుపెట్టాడు. తొలి గేమ్ లో విక్టర్ ఆధిక్యత సాధించినప్పటికీ... మిగిలిన రెండు గేమ్స్ లో శ్రీకాంత్ ఇరగదీశాడు. ముఖ్యంగా మూడో గేమ్ లో పూర్తి ఆధిక్యతను కనబరిచాడు.

55 నిమిషాలు పాటు కొనసాగిన మ్యాచ్ లో 14-21, 22-20, 21-7 తేడాతో శ్రీకాంత్ విజయబావుటా ఎగురవేశాడు. మరోవైపు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, ప్రణయ్ లు ఓటమిపాలై, టోర్నీ నుంచి వైదొలగారు. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ కరోలినా మారిన్ చేతిలో 10-21, 13-21 తేడాతో సైనా ఓడిపోయింది. జపాన్ ఆటగాడు వాన్ హో చేతిలో 13-21, 18-21 తేడాతో ప్రణయ్ ఓటమిపాలయ్యాడు.

kidambi srikanth
denmarki open super series
saina nehwal
prannoy
  • Loading...

More Telugu News