dargah: దర్గాలో దీపావళి వేడుకలు... మతసామరస్యాన్ని చాటిన ఢిల్లీ సూఫీలు
- వెలుగులతో నిండిపోయిన హజ్రత్ నిజాముద్దీన్ దర్గా
- సంబరాలకు మతంతో సంబంధం లేదని నిరూపణ
- మెచ్చుకున్న నెటిజన్లు
భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశానికి ప్రతీక. ఎన్ని మతాలున్నా అందరూ కలిసే ఉంటారనేది దాని అర్థం. దేశ రాజధాని న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో జరిగిన దీపావళి వేడుకలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తోంది. హిందువుల పండగైన దీపావళిని రంగవల్లులు వేసి, దర్గా మొత్తం వెలుగులతో నింపి జరుపుకున్నారు ఈ సూఫీ ముస్లింలు. పండగ సందర్భంగా మిఠాయిలు పంచుకుని, ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు చెప్పుకుని పండగ సంబరాలకు మతంతో సంబంధం లేదని నిరూపించారు. అక్కడి వేడుకల ఫొటోలను కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటిని చూసినవారంతా వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.