isis: ఇటు విజయం.. అటు విధ్వంసం...వీడియో చూడండి!

  • ఐఎస్ఐఎస్ ఖలీఫా రాజ్యానికి రాజధాని రక్కా నగరం
  • నాలుగు నెలలపాటు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో పోరాడిన కుర్దు, అరబ్ వీరులు
  • శిథిలమైన భవనాలు, తుపాకి తూటాలకు రంధ్రాలు పడిన గోడలే యుద్ధ సాక్ష్యాలు

నిన్నటి దాకా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా వున్న రక్కా నగరంపై సంకీర్ణ సేనలు విజయం సాధించాయి. రక్కాను చేజిక్కించుకునేందుకు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు నాలుగు నెలలపాటు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో భీకరంగా పోరాడాయి. ఈ క్రమంలో 3,250 మంది మృత్యువాతపడగా, 2.70 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

ఈ క్రమంలో రక్కాలో ఇంకా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో సిరియా ప్రజాస్వామ్య దళం ( ఎస్డీఎఫ్‌) గాలింపు చేపట్టింది. ఈ సందర్భంగా రక్కా నగరం ఛిద్రమైపోయిన దృశ్యం రెండు వర్గాల మధ్య పోరును కళ్లకు కడుతోంది. వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి. దాడులను తట్టుకుని నిలిచిన ప్రతి భవనం గోడ తుపాకీ తూటాలను తట్టుకుని, మాయని గాయాలను ప్రపంచానికి చాటుతోంది. యుద్ధం మిగిల్చిన విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఈ వీడియో చూడండి. 

isis
rakka
kurdish
arub
war
  • Error fetching data: Network response was not ok

More Telugu News