sai dharam tej: సాయిధరమ్ తేజ్ కనిపించేది 'జవాన్' గా కాదా?

  • సాయిధరమ్ తేజ్ తాజా చిత్రంగా 'జవాన్' 
  • దర్శకుడిగా బీవీఎస్ రవి 
  • కథానాయికగా మెహ్రీన్ 
  • డిసెంబర్ 1వ తేదీన విడుదల    

సాయిధరమ్ తేజ్ .. బీవీఎస్ రవి కాంబినేషన్లో 'జవాన్ సినిమా తెరకెక్కింది. హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, కథానాయికగా మెహ్రీన్ నటించింది. ఈ సినిమా పూర్తయి .. సరైన విడుదల సమయం కోసం ఎదురుచూస్తోంది.

 పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ సినిమాను డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. ఇక టైటిల్ ను బట్టి ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ 'జవాన్' గా కనిపిస్తాడని అనుకున్నారు. కానీ ఈ సినిమాలో ఆయన ఆర్ఎస్ఎస్ సభ్యుడుగా కనిపిస్తాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతో గానీ, ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ .. వినాయక్ సినిమాతో బిజీగా ఉన్నాడనే సంగతి తెలిసిందే.    

sai dharam tej
mehreen
  • Loading...

More Telugu News