revanth reddy: ఏది అడిగినా రేవంత్ రెడ్డి సరిగా సమాధానం చెప్పలేదు: అరవింద్ కుమార్ గౌడ్

  • వివరణ ఇవ్వాలంటూ నేతలంతా అడిగారు
  • రేవంత్ సరైన సమాధానాలు చెప్పలేదు
  • అన్నీ చంద్రబాబుకే చెప్పుకుంటానని అన్నారు

ఈ రోజు జరిగిన టీటీడీపీ అత్యవసర సమావేశానికి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయనపై టీడీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.

సమావేశానంతరం టీటీడీపీ నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అరవిందకుమార్ గౌడ్ మాట్లాడుతూ, తాము ఏది అడిగినా రేవంత్ రెడ్డి సరైన సమాధానం ఇవ్వలేదని అన్నారు. రాహుల్ ను కలిశారా? ఒకవేళ కలిస్తే ఎందుకు కలిశారో చెప్పాలని రేవంత్ ను కోరామని... అయితే, అన్నీ చంద్రబాబుకే చెప్పుకుంటానని రేవంత్ చెప్పారని ఆయన తెలిపారు. రేవంత్ నుంచి సమాధానాలు సరిగ్గా రాకపోవడంతో తాను, మోత్కుపల్లి సమావేశం నుంచి వాకౌట్ చేశామని చెప్పారు.

వివరణ ఇవ్వాలంటూ పార్టీ నేతలంతా కోరినప్పటికీ... రేవంత్ మాత్రం సమాధానాలను దాటవేశారని అరవింద్ అన్నారు. టీడీపీ వల్లే రేవంత్ ఈ స్థాయికి వచ్చారని చెప్పారు. రేవంత్ రెడ్డి టీడీపీని వీడినా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని తెలిపారు.

revanth reddy
tTelugudesam
motkula
aravind kumar gowd
chandrababu
  • Loading...

More Telugu News