revanth reddy: రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం.. అర్థాంతరంగా ముగిసిన టీటీడీపీ అత్యవసర సమావేశం!

  • ఎవరి అనుమతితో రాహుల్ ను కలిశారు?
  • చంద్రబాబు అనుమతి తీసుకున్నారా?
  • చంద్రబాబుతోనే ఈ విషయాన్ని తేల్చుకుందాం

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన తెలంగాణ టీడీపీ నేతల సమావేశం అర్థాంతరంగా ముగిసింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డికి ఇతర నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎవరి అనుమతితో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారని రేవంత్ ను మోత్కుపల్లి, అరవింద్ ప్రశ్నించారు. చంద్రబాబు అనుమతి తీసుకున్నారా? అని అడిగారు. సొంత పార్టీకి చెందిన ఏపీ నేతలపై విమర్శలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా, మీడియాలో వచ్చిన వార్తలకు తాను ఎలా బాధ్యుడిని అవుతానని రేవంత్ అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వద్దే ఈ విషయం తేల్చుకుందామంటూ మోత్కుపల్లి, అరవింద్ వెళ్లిపోయారు. దీంతో, సమావేశం అర్థాంతరంగా ముగిసింది.

revanth reddy
tTelugudesam
motkupalli
Telugudesam leader aravind
  • Loading...

More Telugu News