krk twitter: దీనికంతా కారణం ఆమిర్ ఖానే... కోర్టులోనే తేల్చుకుంటా: కేఆర్కే

  • నా ట్విట్టర్ ఖాతాను ఆమిర్ సస్పెండ్ చేయించాడు
  • న్యాయం కోసం హైకోర్టుకు వెళతా
  • ఆమిర్ సినిమా చెత్తగా ఉందంటూ రివ్యూ ఇచ్చిన కేఆర్కే

బాలీవుడ్ నిర్మాత, నటుడు, విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులపై అసభ్యకర కామెంట్లు చేస్తున్నాడని... ట్వీట్లతో ఇతరులను తీవ్రంగా విమర్శిస్తున్నాడనే కారణంతో అతని ఖాతాను ట్విట్టర్ తొలగించింది.

ఈ నేపథ్యంలో, ఆమిర్ ఖాన్ పై కేఆర్కే మండిపడ్డాడు. తన ఖాతా సస్పెండ్ కావడానికి కారణం ఆమిర్ ఖానే అని ఆరోపించాడు. ఈ విషయాన్ని హైకోర్టులో తేల్చుకుంటానని చెప్పాడు. ఆమిర్ నటించిన 'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమా నిన్న విడుదలైంది. అయితే, ఈ సినిమా చాలా చెత్తగా ఉందంటూ కేఆర్కే రివ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత ట్విట్టర్ లో దుమారం రేగింది. అనంతరం అతని ట్విట్టర్ ఖాతా ఆగిపోయింది.

krk twitter
aamir khan
secret super star
bollywood
  • Loading...

More Telugu News