ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్, బస్టాండ్ లోని వైఫై వాడుతున్నారా?...అయితే ఈ హెచ్చరిక మీకే!
- పబ్లిక్ వైఫై హాట్ స్పాట్ ద్వారా ఇంటర్నెట్ బ్రౌజింగ్ ప్రమాదకరమన్న సీఈటీటీ
- పబ్లిక్ వైఫై హాట్ స్పాట్ లపై కన్నేసిన సైబర్ హ్యాకర్లు
- పబ్లిక్ వైఫై హాట్ స్పాట్ ల వినియోగదారులను హెచ్చరించిన సీఈటీటీ
పబ్లిక్ సైబర్ సర్వీసుల ద్వారా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపవద్దని ఈ సంస్థ కోరింది. వీటిపై సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. అందుకే దేశంలోని విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన వైఫై హాట్ స్పాట్ ల ద్వారా ఆర్థిక కార్యకలాపాలు జరపవద్దని సూచించింది. ఇంటర్ నెట్ బ్రౌజింగ్ కూడా ప్రమాదకరమేనని తెలిపింది. అలా చేయడంవల్ల ఫోన్లలో నిక్షిప్తమై ఉన్న క్రెడిట్ కార్డు వివరాలు, పాస్ వర్డ్ లు, ఛాట్ మెసేజ్ లు, ఈ మెయిల్స్ వంటి వాటిని తస్కరించే అవకాశం ఉందని తెలిపారు. నెటిజన్లు వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ ను వినియోగించాలని సూచించింది.