hani preet: తల్లిదండ్రులను చూసి భోరుమన్న హనీ ప్రీత్!
- అంబాలా జైలులో రిమాండ్ ఖైదీగా హనీప్రీత్
- గుర్మీత్ అరెస్టు సందర్భంగా అల్లర్లకు కుట్రపన్నిందని అరెస్టు
- హనీప్రీత్ ను కలిసేందుకు వెళ్లిన తల్లిదండ్రులు
డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ తన తల్లిదండ్రులను చూసి భోరుమని ఏడ్చింది. గుర్మీత్ అరెస్టు సందర్భంగా అల్లర్లకు కుట్ర పన్నిందంటూ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో హర్యాణాలోని అంబాలా జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తోన్న హనీ ప్రీత్ సింగ్ ను పరామర్శించేందుకు ఆమె తల్లిదండ్రులు వెళ్లారు.
అయితే వారు నిజంగా ఆమె తల్లిదండ్రులేనా? అన్న విషయాన్ని నిర్ధారించుకున్న పిదపే వారిని అధికారులు అనుమతించారు. తన తల్లిదండ్రులు ఆశా, రామానంద్, సోదరుడు సాహిల్ లను చూసి హనీప్రీత్ కన్నీరుమున్నీరైంది. దీపావళిని పురస్కరించుకుని కొవ్వొత్తులు, స్వీట్లు ఆమెకు కానుకగా అందజేశారు.