gutta jwala: టపాకాయల ప్యాకెట్ పై ప్రభాస్, గుత్తా జ్వాల.. ఫొటో వైరల్

  • ప్రభాస్, జ్వాలలతో పాటు అనుష్క ఫొటో కూడా
  • ఫొటోను ట్విట్టర్ లో అప్ లోడ్ చేసిన జ్వాల
  • జీవితంలో అన్నీ సాధించేశానంటూ ట్వీట్

దీపావళి బాణాసంచా ప్యాకెట్లపై టాలీవుడ్ హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలతో పాటు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఫొటోను కూడా ముద్రించారు. వీటి ఫొటోను జ్వాల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్యాకెట్ ఎడమవైపు ప్రభాస్, అనుష్కల చిత్రం ఉండగా, కుడివైపున జ్వాల ఫొటోను ముద్రించారు. ఫొటోను అప్ లోడ్ చేసిన జ్వాల... 'జీవితంలో అన్నీ సాధించేశాను' అంటూ ట్వీట్ చేసింది. గుత్తా జ్వాల అప్ లోడ్ చేసిన ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

gutta jwala
hero prabhas
actress anushka
tollywood
  • Loading...

More Telugu News