jagan: కళ్లతోనే పలకరించుకున్న వైఎస్ జగన్, సబితా ఇంద్రారెడ్డి... గాలికి షేక్ హ్యాండ్!

  • నేడు నాంపల్లి కోర్టులో ఓబులాపురం గనుల కేసు విచారణ
  • విచారణకు వచ్చిన గాలి, సబితా, శ్రీలక్ష్మి
  • ఒకరికి ఒకరు తారసపడ్డ వైఎస్ జగన్ తదితరులు
  • కోర్టు వద్ద భారీ బందోబస్తు

తనపై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం వైకాపా అధినేత వైఎస్ జగన్ వచ్చినవేళ, ఓబులాపురం గనుల కేసు విచారణ కూడా ఉండటంతో, ఈ ఉదయం నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు జగన్ తో పాటు కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ హోమ్ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు.

ఈ కేసుల విచారణ ఒకే ప్రాంతంలో జరగనుండటంతో వీరంతా కలిశారు. జగన్, సబితా ఇంద్రారెడ్డిలు కళ్లతోనే పలకరించుకోగా, గాలి మాత్రం జగన్ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడని సమాచారం. పలువురు వీఐపీలు కోర్టుకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. నేడు కేసు విచారణలో పాల్గొనాల్సిన నిందితులు, వారి తరఫు న్యాయవాదులను మినహా మరెవరినీ కోర్టు ప్రాంగణంలోకి అనుమతించేది లేదని వెల్లడించారు.

jagan
sabita indrareddy
gali janardhan reddy
obulapuram mining
  • Loading...

More Telugu News