karan johar: కరణ్ జొహార్ ఇంట్లో దివాలీ వేడుక‌లు... క‌వ‌ల‌ల ఫొటోలు పోస్ట్ చేసిన ఆలియా భ‌ట్‌!

  • హాజ‌రైన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్` బృందం
  • ఆ సినిమా వ‌చ్చి ఈ దివాలీకి ఐదేళ్లు
  • పార్టీ ఇచ్చిన క‌ర‌ణ్ జొహార్‌

క‌ర‌ణ్ జొహార్ నిర్మాణంలో ఆలియా భ‌ట్‌, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, వ‌రుణ్ ధావ‌న్ న‌టీన‌టులుగా వ‌చ్చిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్‌` సినిమా ఈ దివాలీకి ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత క‌ర‌ణ్ పార్టీ ఇచ్చాడు. దివాలీ వేడుక‌లు, సినిమా పార్టీ రెండు క‌లిపి క‌ర‌ణ్‌, ఆలియా, సిద్ధార్థ్‌, వ‌రుణ్‌లు సెల‌బ్రేట్ చేసుకున్నారు.

పార్టీలో క‌ర‌ణ్ కవల పిల్ల‌లు య‌ష్‌, రూహీల ఫొటోల‌ను ఆలియా త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసింది. నిజానికి త‌న పిల్ల‌ల‌ను సైఫ్, క‌రీనాల పుత్రుడు తైమూర్ అలీ ఖాన్ పుట్టిన‌రోజు నాడు ప్ర‌పంచానికి అధికారికంగా ప‌రిచ‌యం చేయాల‌ని క‌ర‌ణ్ అనుకున్నాడు. కానీ ఆలియా ఫొటోలు షేర్ చేయ‌డంతో క‌రణ్ ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన‌ట్లైంది. ఏదేమైనా పార్టీకి సంబంధించిన ఫొటోల‌ను ఆలియా షేర్ చేయ‌డంతో అభిమానులు ఒకింత సంతోషం వ్య‌క్తం చేశారు.

karan johar
alia bhat
siddarth malhotra
varun dhawan
student of the year
  • Loading...

More Telugu News