chandrababu: మనవడితో దీపావళి చేసుకోకుండా.. మీకోసం వచ్చా: చంద్రబాబు

  • ఇక్కడున్న వారంతా మంచి స్థాయిలో ఉన్నారు
  • ఇంతటితో తృప్తి చెందకూడదు
  • పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదగండి

పుట్టిన నేలను, జన్మభూమిని ఎప్పటికీ మరిచిపోరాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మనవడితో దీపావళి పండుగ చేసుకోకుండా... ప్రజల కోసం, మీ కోసం ఇక్కడకు వచ్చానని చెప్పారు. అమెరికాలోని డెమోయిన్స్ లో టీడీపీ ఫోరం నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తాను చేసిన చిన్న ప్రయత్నంతో మీరంతా ఇక్కడకు వచ్చారని చెప్పారు. ఆనాడు 30 ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్యను 300కు పెంచానని... దీంతో, అందరూ ఉన్నత విద్యలను పూర్తిచేసి, మంచి అవకాశాలను అందుకున్నారని తెలిపారు. ఇక్కడున్నవారంతా మంచి స్థాయిలో ఉన్నారని... ప్రస్తుత స్థాయితో తృప్తి పడకూడదని, మరింత ఎత్తుకు ఎదగడానికి ప్రయత్నించాలని సూచించారు. వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అన్నారు. మన రాష్ట్రం కోసం నెట్ వర్క్ చేయాలని పిలుపునిచ్చారు. 

chandrababu
ap cm
chandrababu us tour
nri
us Telugudesam forum
  • Loading...

More Telugu News