golmal again: అజయ్ దేవగణ్ ఎప్పుడు అడిగినా నటించేందుకు సిద్ధమంటున్న బాలీవుడ్ నటి

  • 'విజయ్‌ పథ్‌', 'తక్షక్‌', 'దృశ్యం' సినిమాల్లో అజయ్‌ దేవగణ్ తో కలిసి నటించిన టబు
  • 'గోల్‌ మాల్‌ అగైన్‌' లో మరోసారి జతకట్టిన టబు
  • అజయ్, నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం

'విజయ్‌ పథ్‌', 'తక్షక్‌', 'దృశ్యం' వంటి సినిమాల్లో అజయ్‌ దేవగణ్ తో కలిసి నటించిన టబు తాజాగా అతనితో జతకట్టిన రోహిత్ శెట్టి సినిమా 'గోల్‌ మాల్‌ అగైన్‌' నేడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ సందర్భంగా టబు మాట్లాడుతూ, అజయ్ తో ఎప్పుడైనా నటించేందుకు సిద్ధమని తెలిపింది. అజయ్, తాను చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులమని తెలిపింది. అందుకే, అజయ్ తో కలిసి నటించాలంటే చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పింది.

అజయ్ హీరోగా నటించినా, దర్శకుడుగా మారినా, నిర్మాతగా మారినా.. ఆయన సినిమాలో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదని చెప్పింది. తాజాగా తామిద్దరం మరోసినిమాకు సంతకం చేశామని తెలిపింది.

ఇదిలా ఉంచితే, 'గోల్‌ మాల్‌ అగైన్‌' సినిమా నేడు విడుదల కానుంది. ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మూడో భాగంగా వస్తోంది.  

golmal again
tabu
ajay devgan
rohit shetty
  • Loading...

More Telugu News